Saturday, November 1, 2008

సంద్రమంత ఆరాటం గుండె గదుల మధ్య కొట్టుమిట్టాడుతూ
బయటకు ఉబకాలని తాపత్రయ పడుతుంటే
బిడియపు తాళము వేసిన నా నాలుక
నీ ముందు నిసబ్దమై పోతుంది

తొణికి వణుకుతున్న నా మనస్సుని సర్దుకొని
పెద్ద ప్రయత్నంతో నా పెదవులు విదివాడే లోపే
నీవు కనుమరుగై పోతావు
నలిగిపోయిన భావాలూ నాతోనే ఉండిపోతాయి

కనులు మూగవైన స్పష్టమైన భావాల్ని అందిస్తాయని
నా కనులతో నా మనోరాజ్యం నీముందు పరచాలనుకొంటే
అధైర్యం క్రమ్మిన కనులు చట్టుక్కున వలిపోతై

ఎంతో చెప్పాలన్న ఆవేశం, ఏమి చెప్పలేక పోయిన ఆక్రోశం
ఆ ఆర్తి ఆలాపన నిశబ్ద గీతమై నీకు చేరనే చేరదు

No comments: